: కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్టు చేసిన సీబీఐ


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలతో ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలకమైన ఫైళ్లు ఎత్తుకెళ్లారంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సీబీఐ అధికారులు రాజేంద్రకుమార్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం చూడలేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News