: వివాదాలు రేపడం సరికాదు...పొరపాట్లు సహజం...కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించుకుందాం: మంత్రి కామినేని


సీతమ్మ విగ్రహం తొలగించిన చోటే పునఃప్రతిష్ఠిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో హిందూ ధర్మపరిరక్షణ సమితి నిర్వహించిన ఆందోళన సభకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో భాగంగా, రోడ్లు వెడల్పు చేస్తున్నారని అన్నారు. అందులో జరిగిన పొరపాట్లను వివాదం చేయవద్దని ఆయన సూచించారు. పొరపాట్లు సరిదిద్దుకుందామని ఆయన అన్నారు. వినాయకుడి గుడి జోలికి వెళ్లే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు. కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో రోడ్లను వెడల్పు చేస్తున్నారని, నూతన రాష్ట్రంలో అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని, వారిని వివాదంలోకి లాగే ప్రయత్నం చేయవద్దని ఆయన సూచించారు. ఇలాంటి వివాదంలో ఓ పది మంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని, మెజారిటీ ప్రజలు ప్రభుత్వంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాల్లో సంయమనం పాటించాలని, వివాదాలు రేపి, ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News