: రాష్ట్ర ప్రభుత్వం తరఫునే హాజరయ్యాను: విజయవాడ సభలో కామినేని
ఆలయాల తొలగింపు క్రమపద్ధతిలో జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో దేవాలయాల తొలగింపునకు నిరసనగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఆరెస్సెస్, వీహెచ్పీ కార్యకర్తలు, పలువురు పీఠాధిపతులు, పలు పార్టీల నేతలు హాజరయ్యారు. సభకు కామినేని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీ మేరకు ఆలయాలను పునర్‌నిర్మిస్తారని ఆయన చెప్పారు. తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫునే బహిరంగ సభకు హాజరయినట్లు ఆయన పేర్కొన్నారు.