: ప్రాజెక్టుల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ లు శకునిలా అడ్డుపడుతున్నారు: హరీశ్‌రావు
తెలంగాణ నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ, క్రాంగ్రెస్ నేతలు శకునిలా అడ్డుపడుతున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గోదావరి జలాల వినియోగంతోనే రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మెదక్ జిల్లా ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తోన్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తమకు అడ్డుతగులుతున్నాయని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అమలు పరుస్తోన్న విధానాలతో తెలంగాణ ప్రజల తలరాతలు మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.