: సంచలన నిర్ణయం తీసుకున్న 'బ్రెగ్జిట్' ఉద్యమ నేత నిగెల్ ఫరాగ్!


యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేలా ఓటేయాలని యూకేలో 'బ్రెగ్జిట్' రెఫరెండానికి అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించిన ఉద్యమ సారధి నిగెల్ ఫరాగ్ యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెంట్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ పెను సంచలన ప్రకటన చేశారు. నేడు సెంట్రల్ లండన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, బ్రిటన్ కు ఈయూ నుంచి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాలన్నది తన 20 సంవత్సరాల కలని, దాన్ని నెరవేర్చుకున్నానని, దీంతో తన కర్తవ్యం పూర్తయిందని భావిస్తున్నానని తెలిపారు. ఇక మిగిలిన పనిని భవిష్యత్తులో ఇండిపెండెంట్ పార్టీని నడిపించే నేతలు చూసుకుంటారని అన్నారు. ఇంతకాలం 'నా దేశం నాకు కావాలి' అంటూ నినదించానని, ఇక 'నా జీవితం నాకు కావాలని కోరుకుంటున్నా' అని వివరించారు. ఈయూ నుంచి బ్రిటన్ పూర్తిగా విడిపోయే వరకూ పార్లమెంటులో సభ్యుడిగా ఉంటానని, ఆపై విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. ఇదిలావుండగా, గతంలోనూ నిగెల్ ఇలా పార్టీ పదవికి రాజీనామా చేసి, ఆపై నేతల ఒత్తిడితో తిరిగి పగ్గాలు చేపట్టారని, ఈ దఫా కూడా అదే జరుగుతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News