: తండ్రన్న గౌరవం ఇవ్వలేదు, అందుకే ఇలా చేశా!: నిస్సిగ్గుగా చెబుతున్న మల్లయ్య
మూడు నెలల క్రితం వివాహం చేసి అత్తవారింటికి పంపిన కూతురిని తొలిసారిగా పుట్టింటికి తీసుకుని వస్తూ, దారుణంగా అత్యాచారం చేసి చంపిన కర్కోటక కామాంధుడు మల్లయ్య, అంతకన్నా నిస్సిగ్గుగా తన ఘనకార్యాన్ని అంగీకరించాడు. తన కుమార్తె తండ్రన్న గౌరవం తనకు ఇవ్వడం లేదని, అందువల్లే అత్యాచారం చేసి చంపానని పోలీసుల ముందు వెల్లడించాడు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలోనూ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మల్లయ్య కనిపించాడు. కూతురిపై ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టిన మల్లయ్యను ఉరితీసి చంపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం నాడు తన బిడ్డను పుట్టింటికి తీసుకువెళ్తానని చెప్పి, ఆపై ఇద్దరు దుండగులు తనను కొట్టి బిడ్డను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన మల్లయ్యను తమదైన శైలిలో విచారించిన పోలీసులు ఈ ఉదయం అసలు విషయాన్ని అతని నోటి నుంచే కక్కించిన సంగతి తెలిసిందే. మల్లయ్యను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు వెల్లడించారు.