: ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిపై వేటు వేయండి: అసెంబ్లీ కార్యదర్శికి వైకాపా పిటిషన్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికై, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైకాపా శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలిసిన వైకాపా నేతలు ఆయన్ను ఎమ్మెల్యేగా తొలగించాలని పిటిషన్ అందించారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయి తిప్పారెడ్డిలు ఈ ఫిర్యాదుపై సంతకాలు చేసి దాన్ని సత్యనారాయణకు అందించారు. నిబంధనల ప్రకారం దాన్ని స్పీకరు కార్యాలయానికి పంపుతానని సత్యనారాయణ చెప్పినట్టు తిప్పారెడ్డి మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News