: అసదుద్దీన్ ఓవైసీపై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ
హైదరాబాద్‌లో దాడులకు తెగబడడానికి కుట్ర చేసిన ఉగ్రవాదులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అరెస్టు అయిన ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తానంటూ మజ్లిస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ దేశద్రోహులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఈరోజు వారు హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహించేలా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హెచ్ఆర్‌సీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈరోజు ఉదయం అసదుద్దీన్ పై ఫిర్యాదు నమోదయిన విషయం తెలిసిందే.