: డిమాండ్లు సాధించేవరకు ఆందోళన విరమించబోం: బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు తాము కొనసాగిస్తోన్న ఆందోళనను విరమించబోమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్రావు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి తమ సమస్యలు, డిమాండ్ల గురించి వివరించారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ల రద్దు అంశాలపై తెలంగాణ న్యాయవాదులు గవర్నర్‌కు వివరించారు. అనంతరం గండ్ర మోహన్రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆందోళన విరమించాల్సిందిగా గవర్నర్ తమకు సూచించారని పేర్కొన్నారు. అయితే, తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఆందోళన విరమించబోమని మీడియాతో ఆయన తెలిపారు. తెలంగాణ న్యాయవాదులకు జరుగుతోన్న అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.