: కొనసాగుతున్న ఆందోళన... గవర్నర్‌ను కలిసిన తెలంగాణ న్యాయవాదులు
తెలంగాణలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో న్యాయవాదులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి తమ సమస్యలు, డిమాండ్ల గురించి వివరించారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ల రద్దు అంశాలపై తెలంగాణ న్యాయవాదులు గవర్నర్‌కు వివరించారు. న్యాయాధికారులు, ఉద్యోగులపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చూడాలని గవర్నర్‌ను కోరారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణకు చెందిన న్యాయాధికారులకు, న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు లేఖను అందించారు.