: సికింద్రాబాద్‌లో దారుణం.. మహిళకు నిప్పంటించిన వైనం
సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ ప్రాంతంలో ఈరోజు ఉదయం దారుణ ఘటన జరిగింది. అక్కడి వడ్డెర బస్తీలో జరిగిన గొడవలో ఓ మహిళపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బస్తీలోని ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవే ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. వ్యక్తి విచక్షణ మరచి చేసిన పనితో నిప్పంటుకున్న మహిళ తీవ్రంగా గాయపడింది. మంటలార్పిన స్థానికులు ఆ మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళకు నిప్పంటించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.