: ‘ఆరోగ్యశ్రీ’ సేవల ఒప్పందంలో కొన్ని ఇబ్బందులున్నాయి: మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిచిపోవడంతో ఆ పథకం ద్వారా లబ్ధిపొందుతోన్న రోగులు అవస్థలు పడుతున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ఈరోజు మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామన్నారు. ఈ సేవల ఒప్పందంలో కొన్ని ఇబ్బందులున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ అంశంలో పలు డిమాండ్లను తమ ముందు ఉంచారని ఆయన చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై తాము మరోసారి చర్చిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రుల యజమానులతో చర్చించిన తరువాత వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.