: సౌకర్యాలు బాగున్నాయా?: వెలగపూడి మహిళా ఉద్యోగులతో సీఎం మాటా మంతి


తాత్కాలిక సచివాలయంలో వసతులు ఎలా ఉన్నాయి? మీకు బస ఎక్కడ ఏర్పాటు చేశారు? భోజనం రుచికరంగా ఉంటోందా? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి? ఎవరూ ఇబ్బందులు పడకుండా చూసుకుంటాం... వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఐదవ బ్లాకులో ఏర్పాటైన శాఖల ఉద్యోగులతో చంద్రబాబు మాట్లాడిన మాటలివి. ఈ ఉదయం అక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి ఐదో భవనం కింది అంతస్తు మొత్తం కలయదిరిగారు. ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని, ఇక్కడికి రావడానికి రహదారులే సరిగ్గా లేవని కొందరు ఫిర్యాదు చేయగా, ఆ సమస్యా త్వరలోనే తీరిపోతుందని చంద్రబాబు అభయమిచ్చారు. అరకొరగా మిగిలివున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, మిగతా భవనాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గత నెలాఖరులో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభమై కొన్ని శాఖలు వచ్చిన తరువాత, చంద్రబాబు పర్యటించడం ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News