: పదవీచ్యుతులు కానున్న కేంద్ర మంత్రులు విజయ్ సంప్లా, నిహాల్ చంద్!


ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించే విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడింది. రేపు ఉదయం 11 గంటలకు క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫ్రాంక్ నోర్హోనా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇక క్యాబినెట్ లో ఎవరు కొత్తగా చేరుతారో, ఎవరి పదవులు ఊడతాయో? అన్న విషయాలపై మాత్రం బీజేపీ వర్గాల నుంచి లీకులు బాగానే వస్తున్నాయి. కేంద్రంలో సహాయ మంత్రులుగా పనిచేస్తున్న విజయ్ సాంప్లా, నిహాల్ చంద్ లను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర నుంచి ఎవరిని తీసుకోవాలన్న విషయమై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీ వచ్చి మోదీతో చర్చలు జరిపారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలతో చర్చించిన ప్రధాని, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. కాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది రెండవ క్యాబినెట్ విస్తరణ. గద్దెనెక్కిన ఐదు నెలల తరువాత నవంబర్ 2014లో ఆయన తొలి విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News