: తాత హత్యకు 14 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న బాలుడు!


పిల్లల్లో పెరుగుతున్న విపరీత మనస్తత్వానికి ఇదో ఉదాహరణ. తన తాతను చంపిన వ్యక్తి కుటుంబంపై కక్ష పెంచుకున్న బాలుడు మరో బాలుడితో కలిపి పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుందీ దారుణం. బాలిక తాత.. తన తాతను 14 ఏళ్ల క్రితం కాల్చి చంపిన విషయాన్ని తెలుసుకున్న బాలుడు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తాతయ్య హత్యకు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న బాలుడు(14), మరో స్నేహితుడు(15)తో కలిసి ఆ కుటుంబానికి చెందిన పదేళ్ల బాలికను బలవంతంగా ఈడ్చుకొచ్చారు. అరవకుండా నోరు మూసి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన దాదాపు గంట తర్వాత రక్తమోడుతున్న కుమార్తెను చూసిన తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది. బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితులైన ఇద్దరు బాలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక ఎవరైనా పెద్దల ప్రోద్బలం ఉందా.. అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు రేకెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News