: నిత్యమూ మాదాపూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకం పెడుతున్న జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి!


కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి, నిత్యమూ మాదాపూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి వెళుతున్నారు. ఓ భూ వివాదంలో ఆయనపై కేసు నడుస్తుండగా, కోర్టు షరతుల మేరకు గత పది రోజులుగా ఆయన నిత్యమూ స్టేషన్ లో హాజరు వేయించుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్ పరిధిలోని ఖానామెట్ లో దామరచెరువు ప్రమీలకు 300 గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఆక్రమించిన కొందరు నకిలీ పత్రాలను సృష్టించారు. వాటిని వేరే వారికి విక్రయించారు. ఆపై ఆ స్థలం రవీంద్రనాథ్ రెడ్డి పేరిట రిజిస్టర్ అయింది. మొత్తం వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు ఆరోపణలు రాగా, కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 23న రవీంద్రనాథ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఆనాటి నుంచి ఆయన స్టేషనులో సంతకం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News