: రోడ్డెక్కిన మెస్సీ ఫ్యాన్స్!... రిటైర్మెంట్ పై పునరాలోచన చేయాలని డిమాండ్!
సాకర్ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియొనెల్ మెస్సీ ఆ క్రీడకు గుడ్ బై చెప్పేశాడు. కోపా అమెరికాలో తన దేశ జట్టు ఓటమితో షాక్ తిన్న మెస్సీ... ఓటమిపాలైన మ్యాచ్ ముగిసిన వెంటనే తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతడి రిటైర్మెంట్ ను అతడి ఫ్యాన్సే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిన్న అర్జెంటీనా నగరం బ్యూనస్ ఎయిర్స్ లో వారంతా రోడ్డెక్కారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయని అభిమానులు... రిటైర్మెంట్ పై మెస్సీ పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.