: షుగర్ పేషెంట్లకు ఖచ్చితంగా శుభవార్తే!
క్యాన్సర్, ఎయిడ్స్ వంటి మహమ్మారి రోగాలకంటె షుగర్ అంటే ఎక్కువ మందిలో ఎక్కువ భయం ఉంటుంది. షుగర్ వ్యాధికి అనుబంధంగా సోకే రోగాలు మనకు అనేకం ఉంటాయి. ఒక దశకు వచ్చాక ప్రతిరోజూ ఇంజెక్షన్ల రూపంలో ఇన్సులిన్ తీసుకోవడం అనేది ఇలాంటి నరకాల్లో ఒకటి. ఈ బాధలకు వైద్యులు తాజాగా ఒక విరుగుడు కనుగొన్నారు.
శరీరంలోనే ఇన్సులిన్‌ను తయారుచేసే ఒక హార్మోన్‌ను వైద్యులు కనుగొన్నారు. ఈ హార్మోన్‌నే ఇంజక్షన్ రూపంలో ఏడాదికి ఒకసారి శరీరంలోకి ఎక్కించుకుంటే.. ఏడాదిపొడవునా సమస్య ఉండదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఈ హార్మోన్ పేరు బీటాట్రోఫిన్ కాగా, హార్వర్ట్ స్టెమ్‌సెల్ ఇన్‌స్టిట్యూట్ వారు ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా దీని సామర్థ్యం గురించి తెలుసుకున్నారు. ఈ బీటా కణాలు.. ఇన్సులిన్ శరీరానికి ఎప్పుడు అవసరమో అప్పుడే ఉత్పత్తి చేస్తాయిట.