: కార్యకర్తలను కాపాడుకోలేనివాడు మనిషే కాదు!: కరణం బలరాం
కార్యకర్తలను కాపాడుకోలేనివాడు మనిషే కాదని టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, మనల్ని కాపాడే కేడర్ ఉన్నప్పుడు వారికేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కాపాడాల్పిన బాధ్యత ఆ పార్టీ నాయకుడికి ఉంటుందని అన్నారు. 1972 నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, 1978లో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణమూర్తి, తాను కాంగ్రెస్ (ఐ) నుంచి గెలిచామని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆవుదూడ కాంగ్రెస్ నుంచి, వెంకయ్యనాయుడు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1978 నుంచి పదవున్నా, లేకపోయినా ప్రజలకు తాను సేవ చేస్తున్నానని చెప్పారు.