: నగరి మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టణంలో రంజాన్ తోఫా సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో సంబంధం లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఫిర్యాదు చేసేందుకని మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి, కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడే టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శాంతకుమారికి, కౌన్సిలర్లకు గాయాలయ్యాయి. వారిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.