: వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి: పరిటాల సునీత


వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘రంజాన్ తోఫా’ సరుకులను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, రంజాన్ తోఫా సరకులు అందరికీ పంపిణీ చేస్తున్నామని, సరకులు సరిగా పంపిణీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ గురించి కూడా ఆమె ప్రస్తావించారు. పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీలు చేస్తున్నామని, వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె హితవు పలికారు.

  • Loading...

More Telugu News