: 'టీఆర్ఎస్'కు కొత్త అర్థం చెప్పిన నాగం!


టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రజాకార్ల సంఘమని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం చేపట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టుల్లో తీవ్ర అవినీతి జరుగుతోందని, టెండర్లు పిలిచినప్పటికీ, క్యాంపు ఆఫీసులో కూర్చునే వాటిని తమకు లంచాలిచ్చిన కంపెనీలకు కేసీఆర్ పంచుతున్నారని ఆరోపించారు. గతంలో అంచనాకన్నా 30 శాతం తక్కువ మొత్తాలకు టెండర్లు వస్తుండేవని, ఇప్పుడు కేవలం 2 శాతం తక్కువకు టెండర్లు వేసిన సంస్థలకు పనులు అప్పగిస్తున్నారని విమర్శించారు. మెగా, నవయుగ కంపెనీలకు అక్రమ మార్గాల్లో పనులు అప్పగించారని, తానేమీ సర్వేలకు, భూ సేకరణకు అడ్డు పడలేదని, టెండర్లలో అక్రమాలపై కోర్టుకు వెళితే, తాను అభివృద్ధికి అడ్డు పడుతున్నట్టు అభాండాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 80 వేల కోట్ల పనుల్లో రూ. 75 వేల కోట్లను ఆంధ్రోళ్లకు అప్పగించారని విమర్శించారు. ఇప్పటివరకూ భూ సేకరణేకాని ప్రాజెక్టులను 36 నెలల్లో ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News