: వీటి జోలికి వెళ్లొద్దు... యూజీసీ ప్రకటించిన ఇండియాలోని 22 ఫేక్ యూనివర్శిటీలివి!


నియమ నిబంధనలకు లోబడి కార్యకలాపాలు సాగించని 22 భారత యూనివర్శిటీలను తప్పుడు వర్శిటీలుగా ప్రకటిస్తూ, యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్) ఓ ప్రకటన వెలువరించింది. ఈ వర్శిటీల్లో విద్యార్థులు చేరవద్దని, ఇవన్నీ స్వయం ప్రకటితాలని, వీటి డిగ్రీలకు గుర్తింపు ఉండదని తెలిపింది. యూజీసీ వెల్లడించిన ఫేక్ వర్శిటీలివి. 1. మైథిలి యూనివర్శిటీ / విశ్వవిద్యాలయం, దర్భంగా, బీహార్. 2. వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి, యు.పి / జగత్ పురి, ఢిల్లీ. 3. కమర్షియల్ విశ్వవిద్యాలయం లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ. 4. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ. 5. ఒకేషనల్ యూనివర్శిటీ, ఢిల్లీ. 6. ఏడీఆర్ - సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్శిటీ, ఏడీఆర్ హౌస్, 8జే, గోపాల టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ - 110 008. 7. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ. 8. బదగన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటి, గోకక్, బెల్గాం (కర్నాటక) 9. సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, కిషనాట్టం, కేరళ 10. రాజా అరబిక్ యూనివర్శిటీ, నాగపూర్. 11. డీడీబీ సంస్కృత విశ్వవిద్యాలయం, పుత్తూర్, త్రిచి, తమిళనాడు. 12. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, 80, చౌరంగీ రోడ్, కోల్ కతా - 20. 13. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్, ఠాకూర్ పూర్, కోల్ కతా. 14. మహిళా గ్రామ విద్యాపీట్ / విశ్వవిద్యాలయ, (మహిళా విశ్వవిద్యాలయం) ప్రయాగ, అలహాబాద్ (ఉత్తరప్రదేశ్). 15. గాంధీ హిందీ విద్యాపీట్ ప్రయాగ, అలహాబాద్ (ఉత్తరప్రదేశ్). 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్. 17. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యూనివర్శిటీ (ఓపెన్ యూనివర్శిటీ), అలిగఢ్ (ఉత్తరప్రదేశ్) 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, కొసికలాన్, మధుర (ఉత్తరప్రదేశ్). 19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్ గఢ్ (ఉత్తరప్రదేశ్). 20. ఇంద్రప్రస్థా శిక్షా పరిషత్, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, ఖోడా, మకన్ పూర్, నోయిడా ఫేజ్-2, (ఉత్తరప్రదేశ్) 21. గురుకుల్ విశ్వవిద్యాలయ బృందావన్, మధుర, (ఉత్తరప్రదేశ్). 22. నబా భరత్ శిక్షా పరిషత్, అన్నపూర్ణ భవన్, ప్లాట్ నం 242, పానీ టాంకీ రోడ్, రూర్కెలా.

  • Loading...

More Telugu News