: అమరావతిలో 2018 ఒలింపిక్స్ అంటూ నోరు జారిన చంద్రబాబు!
ఒలింపిక్స్ పోటీలు 2018లో అమరావతిలో జరగనున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొరపాటున అన్నారు. విశాఖ సాగర తీరంలో నైట్ బే మారథాన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో అమరావతిలో ఆసియా గేమ్స్ జరగనున్నాయని అన్నారు. రెండేళ్లలలో ఒలింపిక్స్ జరుగబోతున్నాయని అనడంతో అధికారులు విస్తుపోయారు. ఆపై నవ్యాంధ్ర రాజధానిలో ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తన పొరపాటును సవరించుకున్నారు. కాగా, నాలుగేళ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్ పోటీలు ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లో జరగనుండగా, 2020లో టోక్యోలో, ఆపై 2024లో రోమ్ లో నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే.