: జకోవిచ్ కలలు కల్లలు... వింబుల్డన్ మూడో రౌండులో పెను సంచలనం!


వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడవ రౌండులో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ చాంపియన్ షిప్ పోటీల్లో విజయం సాధించి, వింబుల్డన్ పై కన్నేసిన జకో, యూఎస్ క్రీడాకారుడు శామ్ క్వెర్రీ చేతిలో 6-7 (6-8), 1-6, 6-3, 6-7 (5-7) తేడాతో ఓటమి పాలై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి రెండు సెట్లనూ ఓడిపోయిన పరిస్థితుల్లో తనదైన ఆటతీరును ప్రదర్శించిన జకో, మూడో సెట్ ను గెలుచుకున్నప్పటికీ, అదే జోరును తుదివరకూ చూపడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం జకో మాట్లాడుతూ, క్వెర్రీ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. జకో ఓటమితో, రెండు, మూడవ సీడ్ లుగా ఉన్న ఆండీ ముర్రే, రోజర్ ఫెదరర్ లకు చాంపియన్ షిప్ గెలుచుకునే విజయావకాశాలు మెరుగయ్యాయి.

  • Loading...

More Telugu News