: సమ్మె పరిష్కారమైంది... ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయి: తెలంగాణ మంత్రి లక్షారెడ్డి
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సమస్య పరిష్కారమైందని ప్రకటించారు. ప్రతి నెలా ఇచ్చే 40 కోట్లకు తోడు ఈ రోజు మరో 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు 350 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన చెప్పారు. దీనిపై మరోదఫా చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు. ఇకపై అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని ఆయన తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్టు రేపు ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు.