: విశాఖవాసులది ఉక్కుసంకల్పం... నగరాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం: చంద్రబాబునాయుడు
విశాఖ వాసులది ఉక్కు సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఆర్కేబీచ్ నుంచి గీతం కళాశాల వరకు నిర్వహించిన బే మారథాన్ ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా సాయంతో విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని అన్నారు. ఈ మారథాన్ కు దేశ నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా క్రీడాకారులు వచ్చారని ఆయన చెప్పారు. భవిష్యత్ లో నిర్వహించే మారథాన్ లకు ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తిరుపతిలో సెవెన్ హిల్స్ పేరుతో మారథాన్ ను నిర్వహించనున్నామని అన్నారు. విశాఖలో మంచి స్టేడియాలు నిర్మించి క్రీడలకు ప్రాధాన్యమివ్వనున్నామని ఆయన ఆయన చెప్పారు.