: ముంబైని ముంచెత్తిన వర్షాలు!


ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంబైని వణికిస్తున్నాయి. ప్రస్తుతానికి రోడ్లపై నీరు నిలవనప్పటికీ, ధారాపాతంగా కురుస్తున్న వర్షం నగరవాసులను ఆందోళనలోకి నెడుతోంది. గత 24 గంటలుగా కొలబా ప్రాంతంలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శాంతాక్రజ్‌లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో ముంబైని మరింత భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో పాటు, గోవాలో కూడా భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక వర్షపాతం కొంకణ తీరంలో నమోదు కావచ్చని వాతావరణ శాఖాధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News