: రెచ్చిపోయిన ముంబయి బ్యాట్స్ మెన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (50), కార్తీక్ (43), పొలార్డ్ (34) తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లలో ముంబయి 7 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కు వేదిక ముంబయిలోని వాంఖడే స్టేడియం. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.