: 200 ఏళ్లనాటి శ్రీరాముడి అష్టధాతు విగ్రహం చోరీ
శ్రీరాముడి అష్టధాతు విగ్రహం చోరీకి గురైన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. గోరియకొత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్ గ్రామంలో ఉన్న ఖాకీ పిప్రా మఠంలోని 200 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహం చోరీకి గురైందని మఠం నిర్వాహకులు తెలిపారు. చోరీకి గురైన అష్టధాతు (ఎనిమిది లోహాలు) విగ్రహం ఖరీదు లక్షల్లో ఉంటుందని వారు చెప్పారు. గత రాత్రి మఠం సమీపంలో ఓ వ్యాన్ ను చూసినట్టు స్థానికులు తెలిపారు. దొంగలు ఆ వ్యాన్ లోనే పరారై ఉంటారని వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యాన్ గురించి ఆరాతీస్తున్నారు.