: ఢాకా ఉగ్రదాడిలో భారతీయ బాలిక తారిషి మృతి


బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉగ్ర‌వాదులు సృష్టించిన నరమేధంలో భారతీయ‌ బాలిక తారిషి మృతి చెందింది. త‌రుషిని బందీగా తీసుకొని ఉగ్ర‌వాదులు కాల్చి చంపేశారు. బాలిక మృతిని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ధ్రువీక‌రించారు. తారిషి మృతి అత్యంత బాధాక‌ర‌మ‌ని ఆమె విచారం వ్య‌క్తం చేశారు. ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం 20 మంది చ‌నిపోయార‌ని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఢాకాలోని విదేశీయులే లక్ష్యంగా ఉగ్ర‌వాదులు నర‌మేధం సృష్టించారు.

  • Loading...

More Telugu News