: కుమార్తె ఫోటోను తొలగించాలని సోషల్ మీడియాను వేడుకుంటున్న షారూఖ్ ఖాన్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను ఓ సంఘటన అత్యంత బాధకు గురి చేసింది. తన స్టార్ డమ్ వల్ల తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నారని షారూఖ్ వాపోతున్నాడు. దీనికి కారణమేంటంటే, ఈ మధ్యే విదేశాల్లో హాలీడేకు వెళ్లిన షారూఖ్ కుటుంబం అక్కడి బీచ్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా తమ్ముడు అబ్ రామ్ ను ఆడిస్తూ, సుహానా బికినీలో సందడి చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై షారూఖ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సుహానాకు కేవలం 16 ఏళ్లేనని, తమ్ముడితో ఆడుకుంటున్న సుహానా ఫోటోను వివాదాస్పదం చేయడం సరికాదని అన్నాడు. సుహానా తన కుమార్తె కాకపోయి ఉంటే ఆ ఫోటోపై ఇంత దుమారం రేగి ఉండేది కాదని, తన స్టార్ డమ్ ఆమెకు ఇబ్బందిగా మారిందని షారూఖ్ వాపోయాడు. సోషల్ మీడియా నుంచి ఈ ఫోటోను డిలీట్ చేయాలని షారూఖ్ కోరాడు.