: ఒవైసీపై ఎన్వీఎస్ఎస్ ఫైర్!... ఉగ్రవాదులకు న్యాయ సాయం ఎలా చేస్తారని నిలదీత!
హైదరాబాదులో ధ్వంసరచనకు పథక రచన చేసి పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తామని ప్రకటించిన మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తామని ప్రకటించడం దేశద్రోహం కిందకే వస్తుందని కూడా ఆయన తేల్చిచెప్పారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్శంగా ఆయన ఒవైసీ వ్యాఖ్యలపై ఫైరయ్యారు. ఉగ్రవాదులకు సాయమందిస్తామని ప్రకటిస్తున్న ఒవైసీ లాంటి వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.