: తల్లి కాబోతున్న కరీనా కపూర్!... డిసెంబర్ లో డెలివరీ అంటూ సైఫ్ అలీఖాన్ ప్రకటన
హిందీ చిత్రసీమలో మరో ప్రముఖ నటి తల్లి కాబోతోంది. ఇప్పటికే బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యా రాయ్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటనను కొనసాగిస్తోంది. తాజాగా రాజవంశానికి చెందిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లాడిన మరో అందాల నటి కరీనా కపూర్ తల్లి కాబోతోంది. ఈ మేరకు కరీనా గర్భవతి అన్న విషయాన్ని స్వయంగా సైఫ్ అలీ ఖానే ధ్రువీకరించాడు. ఈ మేరకు ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ‘పింక్ విల్లా.కామ్’ సైఫ్ ను ఉటంకిస్తూ ఓ కథనం రాసింది. ప్రస్తుతం తన భార్య గర్భవతి అని చెప్పిన సైఫ్... ఈ ఏడాది డిసెంబర్ లో తమ ఇంట తొలి బిడ్డ అడుగుపెట్టనున్నట్లు పేర్కొన్నాడు.