: జనగామలో కొనసాగుతోన్న ఉద్రిక్త వాతావరణం
వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా పలువురు ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చినట్లు సమాచారం. ఈరోజు జనగామలో బంద్‌కు పిలుపునిచ్చారు. నిన్న ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరింపజేసింది. జనగామలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల ఏర్పాటులో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పరచకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.