: సెన్సార్ బోర్డులో మరో తెలుగోడు!... తెనాలికి చెందిన దోనెపూడి దిలీప్ రాజాకు అవకాశం!
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ)లో మరో తెలుగోడికి చోటు దక్కింది. ఇప్పటికే బోర్డులో ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనెపూడి దిలీప్ రాజాను బోర్డు సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు సభ్యుడిగా దిలీప్ రాజా రెండేళ్ల పాటు కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. రెండు దశాబ్దాలుగా టీవీ, సినీ రంగంలో కొనసాగుతున్న దిలీప్ రాజా... దాదాపు 300లకు పైగా టెలి ఫిల్మ్స్ ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.