: మొన్న ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ కాకుంటే... నేడు, రేపు సాయంత్రం పెను విధ్వంసం జరిగేదే!


నాలుగు రోజుల క్రితం హైదరాబాదు పాతబస్తీలో ఐదుగురు ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ కాకపోయి ఉంటే... నేడు (శనివారం), రేపు (ఆదివారం) నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పెను విధ్వంసం జరిగేదే. దాదాపుగా రెండేళ్ల పాటు నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఈ దాడులకు వ్యూహ రచన చేసిన ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఉగ్రవాదులు పలు సంచలన విషయాలను వెల్లడించారు. శని, ఆదివారాల్లో ప్రత్యేకింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య దాడులకు పథక రచన చేసినట్లు వారు చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో జనం ఎక్కువగా ఉంటారని, ఆ సమయంలో దాడి చేస్తే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని భావించామని ఆ ముష్కరులు తెలిపారు.

  • Loading...

More Telugu News