: రాశి, నక్షత్రం ఆధారంగా మొక్కలు పంపిణీ చేయండి: కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నక్షత్రం, రాశి ఆధారంగా ఎవరైనా మొక్కలు అడిగితే పంపిణీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో హరితహారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్షత్రాలు రాశుల ఆధారంగా మొక్కలు నాటే విధానం దేశంలో అనాదిగా ఉందని అన్నారు. దీంతో జ్యోతిష్యులు, పండితులను సంప్రదించి, తమ జన్మనక్షత్రం, రాశి ఆధారంగా అనుకూలమైన మొక్కలేవో తెలుసుకుని వాటిని నాటుతారని, దానిని తోసిపుచ్చవద్దని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిష్యులు, పండితులు ఇచ్చిన ప్రతిపాదనలను అటవీశాఖ అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.