: ప్రతిదాన్ని వివాదం చేయడం తెలంగాణకు సరికాదు: చంద్రబాబునాయుడు
హైకోర్టు, ఆంధ్రాభవన్... ఇలా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయాలనుకోవడం తెలంగాణకు సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు పలికారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఘర్షణపూరిత వాతావరణానికి తాను వ్యతిరేకినని అన్నారు. తన శక్తియుక్తులన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వెచ్చిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తమకు కూడా నష్టమేనని కేంద్రం గుర్తించాలని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేసిన తరువాత విభజన చేయాలని ఉందని ఆయన తెలిపారు. అలాంటప్పుడు ఇప్పుడు విభజన ఏ రకంగా సహేతుకమో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. అన్నీ వదులుకున్న తాము హైకోర్టును మాత్రం ఎందుకు వదులుకోమని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆయన తెలిపారు.