: ఇకపై తక్కువగా మాట్లాడుతా: సుబ్రహ్మణ్య స్వామి


సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఇకపై తక్కువగా మాట్లాడుతానని అన్నారు. ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. రామ మందిరం, జాతీయ రహదారులు, ఎయిర్ సెల్ మాక్సిస్, సీఎస్ కే బ్యాన్ మొదలైన అంశాలపై తాను దృష్టి పెట్టాల్సి ఉన్నప్పటికీ, ఒక వారం రోజుల పాటు తక్కువ ట్వీట్లు చేసి సరిపెట్టుకుంటానని తన ట్వీట్ లో సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. కాగా, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్ ను లక్ష్యంగా చేసుకుని సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించడం జరిగింది. ఈ తరహా వ్యాఖ్యలు దేశానికి మంచి చేయవని, పబ్లిసిటీ కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని మోదీ సూచించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News