: బలహీనవర్గాల సంపద దోచుకుని జగన్ తప్పుచేశారు: ఏపీ మ‌ంత్రి రావెల‌


వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తులను తాజాగా ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి రావెల కిశోర్‌బాబు స్పందించారు. బలహీనవర్గాల సంపదను అక్ర‌మంగా దోచుకుని జగన్ తప్పుచేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాభివృద్ధికి వైసీపీ నేత‌లు ఆటంకాలు సృష్టిస్తుండ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చైనాలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వేల కోట్ల పెట్టుబ‌డులు సాధించారని రావెల పేర్కొన్నారు. త్వ‌ర‌లో చంద్ర‌బాబు ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పట్ల‌ స్నేహ‌పూర్వ‌కంగా ముందుకెళ్లే త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News