: ఫేస్ 'బుక్' అయిన రేపిస్ట్!


ఫేస్ బుక్ ద్వారా యువతులకు వల వేసి, అత్యాచారానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ రేపిస్టును ఫేస్ బుక్ ద్వారానే పోలీసులు పట్టేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఫ్యాషన్, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో సత్తాచాటేందుకు యువతులు ఉత్సాహం చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న సందీప్ యాదవ్ (25) అనే వ్యక్తి ప్రజ్ఞ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. దీనితో యువతులకు వలవేసి, వారి అభిరుచులు తెలుసుకునేవాడు. మోడలింగ్ ఇంట్రెస్ట్ అని తెలుసుకున్న మరుక్షణం తమ బాస్ సందీప్ (అతని అసలుపేరు) ను కలిస్తే మంచి అవకాశం కల్పిస్తారంటూ చెప్పేవాడు. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేవాడు. దీంతో ఫోటో షూట్ పేరుతో వారిని ముంబైలోని బీచ్ రిసార్టుకు రప్పించుకుని, అక్కడ కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చి లోబరుచుకునేవాడు. ఈ తంతంగం మొత్తం సెల్ ఫోన్ లో రికార్డు చేసి, మెలకువ వచ్చిన తరువాత వారికి చూపించి, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు దిగేవాడు. దీంతో బాధితులు లబోదిబో మంటూ అతను చెప్పినట్టు చేసేవారు. తాజాగా నడి రోడ్డుపై ఓ బాధితురాలిపై అతను రంకెలేస్తుండగా అక్కడ పెట్రోలింగులో వున్న పోలీసు అతనిని స్టేషన్ కి తీసుకువెళ్లాడు. ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగిందని సందీప్ అబద్ధం చెప్పడంతో అతనిని వదిలేశారు. అయితే, ఆ తర్వాత ఆ బాధితురాలు స్టేషన్ కు వెళ్లి అసలు విషయం చెప్పింది. తన స్నేహితులను సందీప్ ఎలా వాడుకుని హింసిస్తున్నదీ వివరించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె స్నేహితురాలిని రంగంలోకి దింపి, ఫేస్ బుక్ లో సందీప్ కి ఫ్రెండ్ రిక్వెస్టు పెట్టించారు. యథావిధిగా సందీప్ లైన్లోకి వచ్చాడు. బీచ్ రిసార్టు అడ్రస్, కలవాల్సిన సమయం చెప్పాడు. నేరుగా అక్కడికి వెళ్లిన పోలీసులు అతనిని పట్టుకుని కటకటాల వెనుకకు నెట్టారు.

  • Loading...

More Telugu News