: ఆందోళన విరమించండి.. లేదంటే ప్రత్యామ్నాయాలు చూడాల్సి ఉంటుంది: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణ న్యాయవాదులు పెద్ద ఎత్తున చేస్తోన్న ఆందోళనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్ బాబాసాహెబ్ బోస్లే స్పందించారు. న్యాయమూర్తులు, ఉద్యోగులు, న్యాయవాదులు చేస్తోన్న ఆందోళనను విరమించాలని ఆయన కోరారు. న్యాయవాదుల ఆందోళన చట్టవ్యతిరేకమని ఆయన అన్నారు. ధర్నాలు, సమ్మెలు సరికావని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారిని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఆందోళన విరమించకుంటే ప్రత్నామ్నాయాలు చూడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.