: అసెంబ్లీ గాంధీ విగ్రహం ముందు మౌనదీక్షకు దిగనున్న వీహెచ్


తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. భూములు కోల్పోయిన వారికి మద్దతుగా వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాసేపట్లో వీహెచ్ మౌనదీక్షకు దిగనున్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ వ‌ద్ద ఆయ‌న ఈరోజు దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అక్క‌డి గాంధీ విగ్రహం ముందు కాసేప‌ట్లో ఆయ‌న మౌన‌దీక్ష‌కు దిగి ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న తెల‌ప‌నున్నారు.

  • Loading...

More Telugu News