: ఉగ్రవాదుల కస్టడీ పిటిషన్ పై వాదనలు జరిగేనా?


భాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసానికి పథక రచన చేసిన ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మొన్న అరెస్ట్ చేశారు. సకాలంలో ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో హైదరాబాదులో పెను విధ్వంసం తృటిలో తప్పింది. ఉగ్రవాదుల పన్నాగాలపై మరింత స్పష్టత కోసం ఎన్ఐఏ సదరు ఉగ్రవాదులను 30 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నిన్ననే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కాసేపట్లో వాదనలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా న్యాయవాదులు కోర్టు కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కస్టడీ పిటిషన్ పై వాదనలు జరగుతాయా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News