: ‘హోదా’, ‘ప్యాకేజీ’... ఏమిస్తారో తేల్చండి!: కేంద్రంతో అమీతుమీకే చంద్రబాబు సిద్ధం!


ఐదు రోజుల చైనా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీకే సిద్ధపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నదే. ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు అనుకున్న మేరకు ఇప్పటిదాకా కేంద్రం స్పందించిన దాఖలా కనిపించలేదు. దీంతో చైనా పర్యటన నుంచి నేరుగా ఏపీకి రాకుండా ఆయన ఢిల్లీలోనే ల్యాండయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ... రెండూ ఇవ్వండి. లేదంటే వాటిలో ఏదో ఒక దానిని ఇవ్వాల్సిందే. అసలు ఏమిస్తారో తేల్చండి’’ అంటూ చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరికాసేపట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News