: రోడ్డెక్కిన డీకే అరుణ!... బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జాం!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ రోడ్డెక్కారు. ఫలితంగా హైదరాబాదు- బెంగళూరు హైవేపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ తమ ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డీకే అరుణ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆమె డిమాండ్ కు అంత సానుకూలంగా స్పందించిన దాఖలా కనిపించలేదు. దీనిపై సమాచారం అందుకున్న డీకే అరుణ భగ్గుమన్నారు. పాలమూరు జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా వద్దకు వచ్చిన ఆమె జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News