: లేడీ డాన్ ను అప్పగించండి!... కోల్ కతా హైకోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్!
విలువైన ఎర్రచందనం దుంగలను గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించడంలో మగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా చక్రం తిప్పిన లేడీ డాన్ సంగీతా చటర్జీని ఏపీకి తీసుకువచ్చేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. సంగీతా కోసం ఇటీవలే కోల్ కతా వెళ్లిన పోలీసులకు ఆమె దొరికింది. అయితే అక్కడి కోర్టులను ఆశ్రయించిన సంగీత, ఇంటీరియమ్ బెయిల్ తీసుకుని చిత్తూరు ఇప్పుడప్పుడే వచ్చేది లేదని తేల్చి చెప్పింది. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ లో ఇప్పటికే సంగీత ప్రమేయాన్ని నిర్ధారించిన పోలీసులు.. ఆమెను తమకు అప్పగించాలని కోరుతూ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిన్న చిత్తూరు పోలీసులు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.