: వైఎస్ జగన్ కు చేరిన ఈడీ అటాచ్ నోటీసులు!... లాయర్లతో విపక్ష నేత సుదీర్ఘ మంతనాలు!
సింగిల్ టేక్ లో ఏకంగా రూ.750 కోట్ల మేర విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) అధికారులు నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిలో వాలిపోయారు. సదరు అటాచ్ మెంట్ కు సంబంధించిన నోటీసులను వారు జగన్ కు స్వయంగా అందజేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే... ఊహించని విధంగా ఈడీ తీసుకున్న నిర్ణయంతో జగన్ అయోమయంలో పడ్డారు. ఈ మేరకు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించిన ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదులతో భేటీ అయ్యారు. కొందరు న్యాయవాదులను లోటస్ పాండ్ లోని తన ఇంటికి పిలిపించుకున్న జగన్ వారితో దాదాపు 2 గంటలకు పైగా మంతనాలు జరిపారు.