: ప్రాజెక్టు మొదలైన మూడు దశాబ్దాల తర్వాత... ఐఏఎఫ్‌ అమ్ముల పొదిలోకి తేజాస్!


దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) తేజాస్ నేడు భారత వైమానిక దళంలో చేరనుంది. మూడు దశాబ్దాల క్రితం ఎల్‌సీఏ ప్రాజెక్టును చేపట్టి విమానాన్ని అభివృద్ధి చేశారు. పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం బెంగళూరులోని ఐఏఎఫ్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏఎస్‌టీఈ)లో నిర్వహించే కార్యక్రమంలో తేజాస్‌ను అధికారికంగా ఐఏఎఫ్‌లో ప్రవేశపెట్టనున్నారు. తేజాస్‌ను బెంగళూరులోని డీఆర్‌డీఓలో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) దీనిని తయారుచేసింది. ప్రస్తుతం హెచ్ఏఎల్ 20 తేజాస్ యుద్ధవిమానాలను తయారుచేస్తోంది. 1983లోనే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టినా వివిధ కారణాలతో ఆగిపోయింది. 1998లో ఫోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా మధ్యలో కొంతకాలం ప్రాజెక్టుకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కావడంతో విమాన తయారీలో వేగం పుంజుకుంది. జనవరి 4, 2001లో తొలి విమానం నింగికెగసింది. ప్రస్తుతం అన్ని అనుమతులు పూర్తిచేసుకున్న తేజాస్ వాయుసేనలోకి చేరేందుకు సిద్ధమైంది. సింగిల్ ఇంజిన్ కలిగిన తేజాస్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నింగికెగర గలదు. మిగ్ 21 స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లను ఇది మోసుకెళ్లగలదు. అలాగే ఎయిర్ టు గ్రౌండ్ రాకెట్, మిసైళ్లు, యాంటీ షిప్ మిసైళ్లు, లేజర్ గైడెడ్ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం తేజాస్ సొంతం. తేజాస్ చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News